జీసీసీ మాజీ చైర్మన్ గాంధీ నాయక్ అరెస్ట్

ఇంటి వద్దే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వర్ధన్నపేట పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు జనగామ, నవంబర్‌ 5 (ప్రజానేస్తం జ్వాల): జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండాలో జీసీసీ మాజీ చైర్మన్ ధరావత్ గాంధీ నాయక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఆయన నివాసం వద్దకు చేరుకున్న పోలీసులు గాంధీ నాయక్‌ను అదుపులోకి తీసుకుని వర్ధన్నపేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాంధేయ మార్గంలో నిరసన ధర్నా నిర్వహించేందుకు వెళ్తుండగా పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ అరెస్ట్‌పై ఆయన అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేశారు