2,557 మంది విద్యార్థులకు అల్పాహారం.. ప్రభుత్వ పాఠశాలల్లో పథకం ప్రారంభం

విద్యార్థుల ఆరోగ్యం, అభ్యసన సామర్థ్యం పెంపే లక్ష్యం భీమదేవరపల్లి, నవంబర్‌ 5 (ప్రజానేస్తం జ్వాల): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అల్పాహార పథకం భీమదేవరపల్లి మండలంలో గురువారం ప్రారంభమైంది. కొత్తకొండ జెడ్పీహెచ్‌ఎస్‌లో అడిషనల్ కలెక్టర్ శేషాద్రి ముఖ్య అతిథిగా పాల్గొని పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ బి. శంకర్ నాయక్ మాట్లాడుతూ.. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2,557 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రతిరోజూ అల్పాహారం అందించనున్నట్లు తెలిపారు. పౌష్టికాహారం వల్ల విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు పాఠశాలల హాజరు, చదువుపై ఏకాగ్రత, అభ్యసన సామర్థ్యం పెరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈఓ గిరిరాజ్ గౌడ్,...