డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె

రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ భీమదేవరపల్లి, నవంబర్‌ 5 (ప్రజానేస్తం జ్వాల): ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు యూనియన్ నాయకులు ప్రకటించారు. ముల్కనూర్, వంగర పీహెచ్‌సీల పరిధిలోని 55 మంది ఆశా కార్యకర్తలు ఈ సమ్మెలో పాల్గొననున్నారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పీహెచ్‌సీలో యూనియన్ నాయకులు టి.శోభ, పుథిలి ఆధ్వర్యంలో వైద్యాధికారి డాక్టర్ రెహమాన్‌కు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు గత 20 ఏళ్లుగా ప్రజారోగ్య సేవల్లో...