కొండాయిగూడెంలో 120 మందికి ఉచిత కంటి పరీక్షలు

కొండాయిగూడెం, నవంబర్‌ 5 (ప్రజానేస్తం జ్వాల): సూర్యాపేట జమ్మిగడ్డ లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కందుల మంగమ్మ కోటిరెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో సుమారు 120 మంది కంటి పరీక్షలు చేయించుకోగా, వారిలో 26 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని వైద్యులు గుర్తించారు. వీరికి సూర్యాపేట జమ్మిగడ్డ ఆసుపత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఇందులో భాగంగా ఎనిమిది మందిని లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి కూడా త్వరలో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించేందుకు ఆసుపత్రి నిర్వాహకులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా...