విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న కడియం శ్రీహరి, కడియం కావ్య

విమానాశ్రయంలో స్వాగతం పలికిన ధర్మసాగర్ మండలవాసులు ధర్మసాగర్, నవంబర్‌ 5 (ప్రజానేస్తం జ్వాల): విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్యకు విమానాశ్రయంలో ధర్మసాగర్ మండలానికి చెందిన పలువురు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వాగత కార్యక్రమానికి హాజరైన వారందరికీ ధర్మసాగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, తాటికాయల మాజీ సర్పంచ్ పెసరు రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. విమానాశ్రయానికి వచ్చిన వారంతా క్షేమంగా తమ గ్రామాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.