పోలీసుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలి
5వ రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో ముఖ్య అతిథులుగా జంగా రాఘవరెడ్డి, తోట శ్యామ్ ప్రసాద్ హనుమకొండ, నవంబర్ 5 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026 కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు, రాష్ట్ర ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తోట శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న పోలీస్ క్రీడాకారులు, క్రీడా అధికారులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడలు కేవలం పోటీలకే...