కుడా పరిధిలో కీలక ప్రాజెక్టులకు రూ.4,200 కోట్లు.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ గ్రీన్ సిగ్నల్!
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) పరిధిలో చేపట్టనున్న పలు కీలక అభివృద్ధి పనులకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ నుంచి భారీ ఊరట లభించింది. మొత్తం రూ.4,200 కోట్ల విలువైన నిధుల ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌లో భాగంగా స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి రూ.1,240 కోట్లు, గోదావరి తాగునీటి పథకానికి రూ.398.40 కోట్లు, చారిత్రక ఖిలా వరంగల్ అభివృద్ధి పనులకు రూ.262.27 కోట్లు కేటాయించనున్నారు. అలాగే నగర ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్‌స్టేషన్ ఆధునీకరణకు రూ.250 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది.