సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్: నేడు ఖాతాల్లోకి రూ.1,10,250 దీపావళి బోనస్ జమ!

హనుమకొండ, 05 నవంబర్ 2026 (ప్రజానేస్తం జ్వాల- ప్రతినిధి : మారెల్లి కిరణ్): సింగరేణి కార్మికుల బ్యాంకు ఖాతాల్లో ఈరోజు దీపావళి బోనస్ నగదు జమ కానుంది. అర్హులైన సుమారు 36 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250 చొప్పున పర్ఫార్మెన్స్ రిలేటెడ్ లింక్డ్ రివార్డు (PLR) బోనస్‌ను చెల్లించేందుకు యాజమాన్యం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకోసం సంస్థ మొత్తం రూ.419 కోట్లను విడుదల చేయనుంది. అంతకుముందు కార్మికులకు సగటున రూ.1,53,912 చొప్పున లాభాల వాటాను ప్రకటించి పంపిణీ చేసిన విషయం తెలిసిందే. పండుగ వేళ ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ అవుతుండటంతో సింగరేణి కార్మిక కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతోంది.