వరంగల్లో కలకలం: రైతుభరోసా పేరుతో సైబర్ మోసం.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు!
రైతు భరోసా పథకం కింద బ్యాంకు ఖాతాల్లో రూ.12 వేలు జమ అయినట్లు సీఎం రేవంత్రెడ్డి పేరిట వచ్చిన నకిలీ మెసేజ్లు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్నదాతలను తీవ్ర అయోమయానికి గురిచేశాయి. అర్థరాత్రి వేళల్లో రైతుల మొబైల్ ఫోన్లకు ఈ సందేశాలు రావడంతో తొలుత వారంతా సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఉదయం బ్యాంకు ఖాతాలను పరిశీలించగా అందులో ఎలాంటి నగదు జమ కాలేదని గుర్తించి ఖంగుతిన్నారు. రైతులను ఆందోళనకు గురిచేస్తున్న ఈ నకిలీ సందేశాలపై ఉన్నతాధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. గుర్తుతెలియని లింకులు, ఇలాంటి నకిలీ మెసేజ్ల పట్ల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.