ఈ నెల 10 నుంచి చారిత్రక రామప్ప దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలు!

యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయంలో ఈ నెల 10వ తేదీ నుంచి కార్తీక మాస ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్ వెల్లడించారు. ఈ ఉత్సవాల సందర్భంగా రూ.1116 చెల్లించి రశీదు పొందిన భక్తులకు నెల రోజుల పాటు రామలింగేశ్వర స్వామివారికి అభిషేకం చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. రశీదు పొందిన వారికి స్వామివారి ప్రసాదం, శేష వస్త్రాలు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించి అభిషేక పూజల్లో పాల్గొనాలని ఈవో సూచించారు.