జాతీయ టెన్నికాయిట్ పోటీలకు ఎంపికైన ఓరుగల్లు క్రీడాకారులు: అభినందించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి!
హనుమకొండ, నవంబర్ 05 (ప్రజానేస్తం జ్వాల- ప్రతినిధి : మారెల్లి కిరణ్): రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ ఛాంపియన్షిప్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఉమ్మడి వరంగల్ జిల్లా క్రీడాకారులను వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. బుధవారం హనుమకొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఎంపికైన క్రీడాకారులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు జమ్మూకశ్మీర్ వేదికగా జరగనున్న జాతీయ టెన్నికాయిట్ పోటీల్లో సత్తా చాటి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ జాతీయ జట్టులో బాలుర విభాగం నుంచి 8 మంది, బాలికల విభాగం...