హనుమకొండలో రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత: డీఈ సాంబరెడ్డి వెల్లడి!
హనుమకొండ, నవంబర్ 05 (ప్రజానేస్తం జ్వాల- ప్రతినిధి : మారెల్లి కిరణ్): విద్యుత్ లైన్ల అత్యవసర నిర్వహణ, అభివృద్ధి పనుల కారణంగా బుధవారం హనుమకొండ నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ డీఈ సాంబరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్ట్స్ కాలేజీ, పోస్టల్ కాలనీ, సుబేదారి పరిసర ప్రాంతాల్లో ఉదయం 9:00 గంటల నుండి ఉదయం 11:00 గంటల వరకు కరెంట్ సరఫరా ఉండదు. అలాగే రెవెన్యూ కాలనీ, జూలైవాడ, నాగేంద్రనగర్ ప్రాంతాల్లో ఉదయం 9:30 నుండి 11:30 గంటల వరకు, డబ్బాల ప్రాంతం మరియు ఎల్పీఆర్ఎన్ కాలనీలలో ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు...