లంచం తీసుకుంటుండగా బజార్హత్నూర్ ఎస్సైని పట్టుకున్న ఏసీబీ అధికారులు
ఆదిలాబాద్, నవంబర్ 4 (ప్రజానేస్తం జ్వాల): ఆదిలాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన దాడిలో బజార్హత్నూర్ ఎస్సై రమేశ్ పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో అనుకూలంగా వ్యవహరించేందుకు బాధితుడిని లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బజార్హత్నూర్ మండలానికి సంబంధించిన ఓ కేసు విషయంలో ఎస్సై రమేశ్ రూ.40 వేలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. లంచం ఇచ్చేందుకు ఇష్టపడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అధికారులు ముందస్తు ప్రణాళికతో దాడి నిర్వహించి, నగదు తీసుకుంటున్న సమయంలో ఎస్సైను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు...