డ్రోన్లు, రోబోటిక్ టెక్నాలజీ, వ్యవసాయ యంత్రాల వినియోగంపై వివరించిన విద్యార్థినులు

కీతవారిగూడెం, నవంబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల): సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలో గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏలూరులోని సీహెచ్‌ఎస్‌డీ సెయింట్ థెరిస్సా మహిళా కళాశాలకు చెందిన బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థినులు గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం, పంటలకు పురుగుమందులు, ఎరువుల పిచికారీలో వాటి ఉపయోగాలు, రోబోటిక్ సాంకేతికత ద్వారా వ్యవసాయ పనులను వేగంగా పూర్తి చేసే విధానాలను రైతులకు వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో కూలీల ఖర్చులు, సమయం, శ్రమ తగ్గడంతో పాటు వ్యవసాయ...