గోదాంలలో బియ్యం నిల్వలు, నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
ఆరు బఫర్ గోదాంల హమాలీలకు లేబర్ కార్డులు అందేలా చర్యలు సూర్యాపేట, నవంబర్ 04 (ప్రజానేస్తం జ్వాల): గోదాంలలో బియ్యం నిల్వలు, నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయొద్దని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కోదాడ సమీపంలోని బాలాజీనగర్ ఎస్‌డబ్ల్యూసీ గోదాంను కలెక్టర్, జిల్లా ఎస్పీ కె. నరసింహతో కలిసి సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాంలోని బియ్యం నిల్వలు, నిర్వహణ తీరును పరిశీలించారు. స్టాక్ రికార్డులను తనిఖీ చేయడంతో పాటు బియ్యం నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షలు చేయించారు. పరీక్ష ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పేదలకు పంపిణీ చేసే సన్న బియ్యాన్ని జాగ్రత్తగా...