క్రైస్తవ యువతులపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలి

సూర్యాపేట, నవంబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల): హైదరాబాద్ అల్మాస్‌గూడ, మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల క్రైస్తవ యువతులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిషప్ దుర్గం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దాడికి సంబంధించిన ఫొటోలను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై దాడులు అమానుషమని, బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఘటనపై తక్షణమే కేసు నమోదు చేసి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకపోతే...