డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె: డీఎంహెచ్‌వో, డీఆర్వోలకు సమ్మె నోటీసు!

హనుమకొండ, నవంబర్ 04 (ప్రజానేస్తం జ్వాల- ప్రతినిధి : మారెల్లి కిరణ్): తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ఆశా కార్యకర్తలు ప్రకటించారు. ఈ మేరకు సీఐటీయూ (CITU) జిల్లా కార్యదర్శి రమేష్ నేతృత్వంలో ప్రతినిధి బృందం హనుమకొండ డీఎంహెచ్‌వోతో పాటు కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో రాజేష్ కుమార్‌కు అధికారికంగా సమ్మె నోటీసులు అందజేశారు. ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల స్థిర వేతనం (ఫిక్స్‌డ్ పే) చెల్లించాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని మరియు విపరీతంగా పెరిగిన పని భారాన్ని వెంటనే తగ్గించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేశారు. అలాగే ఈ...