గ్రామ పరిశుభ్రతకు బండతండా పంచాయతీ ప్రత్యేక చర్యలు

చెట్ల కొమ్మలు, పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమం బండతండా, నవంబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల): గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బండతండా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని రహదారుల వెంట, బహిరంగ ప్రదేశాల్లో పెరిగిన చెట్ల కొమ్మలు, పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాలోతు అరుణ నాగరాజు, ఉపసర్పంచ్ రాజశ్రీ, వార్డు సభ్యుడు మంగ సంపత్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని వారు కోరారు.