వరద విపత్తుల వేళ బాధితులకు ఆహార పొట్లాలు చేరవేసేందుకు డ్రోన్: హయగ్రీవాచారి మైదానంలో అగ్నిమాపక శాఖ ట్రయల్స్!

హనుమకొండ, నవంబర్ 04 (ప్రజానేస్తం జ్వాల- ప్రతినిధి : మారెల్లి కిరణ్): భారీ వర్షాలు, ఆకస్మిక వరదల సమయంలో లోతట్టు కాలనీలు జలమయమై బాధితులు చిక్కుకుపోతే.. అత్యవసరంగా ఆహార పొట్లాలు, మందులు అందించేందుకు హనుమకొండ అగ్నిమాపక శాఖ అత్యాధునిక రెస్క్యూ డ్రోన్‌ను సిద్ధం చేసింది. సుమారు రూ.7 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన ఈ అత్యాధునిక డ్రోన్ దాదాపు 10 కిలోల బరువు గల ఆహార పదార్థాలను గగనతలం గుండా సురక్షితంగా చేరవేయగలదు. బుధవారం హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో ఫైర్ సిబ్బంది ఈ డ్రోన్‌ పనితీరును ప్రయోగాత్మకంగా పరీక్షించి విజయవంతమైన ట్రయల్ రన్ నిర్వహించారు. విపత్తుల సమయంలో వేగంగా సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ డ్రోన్...