నర్సంపేట లక్ష్నేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: టాటా ఏసీ ఢీకొని విద్యార్థి దుర్మరణం, మరొకరి పరిస్థితి విషమం!
హనుమకొండ, నవంబర్ 04 (ప్రజానేస్తం జ్వాల- ప్రతినిధి : మారెల్లి కిరణ్): వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్ష్నేపల్లి శివారు ప్రధాన రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాలేజీ విద్యార్థులు ఇద్దరు ద్విచక్ర వాహనంపై నర్సంపేట నుంచి వరంగల్ వైపు వెళ్తుండగా, ఎదురుగా అతివేగంగా దూసుకొచ్చిన టాటా ఏసీ వాహనం వారి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్ర ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న విద్యార్థి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, వెనుక కూర్చున్న మరో విద్యార్థి తీవ్ర గాయాలపాలై కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, క్షతగాత్రుడిని ప్రాథమిక చికిత్స నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి...