హుజూర్నగర్ మున్సిపాలిటీలో ముసలం
భార్యల పదవులు.. భర్తల పెత్తనంపై కౌన్సిలర్ల ఫిర్యాదు? నిన్న భూ పంచాయితీలు.. నేడు ఆధిపత్య వివాదాలు.. అధికార పార్టీలో అంతర్గత అసంతృప్తి కలకలం! సూర్యాపేట జిల్లా | హుజూర్నగర్ | ప్రజానేస్తం జ్వాల హుజూర్నగర్ మున్సిపాలిటీలో రాజకీయ పరిణామాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటికే భూ వ్యవహారాల వివాదాలతో చర్చల్లో నిలిచిన మున్సిపాలిటీలో తాజాగా మహిళా ప్రజాప్రతినిధుల పదవుల విషయంలో వారి భర్తల జోక్యం, పెత్తనం అంశం మరో కొత్త పంచాయితీకి తెరలేపింది. ఈ వ్యవహారంపై పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పదవులు భార్యలవి.. పెత్తనం భర్తలదా? అన్న ప్రశ్న ఇప్పుడు మున్సిపల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజల ఓట్లతో ఎన్నికైన...