పేద కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆర్థిక సాయం

హుజూర్‌నగర్, నవంబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల): హుజూర్‌నగర్ పట్టణంలోని 15వ వార్డుకు చెందిన ఇటీవల మృతి చెందిన కుడితొట్టి అబ్రహం కుటుంబానికి బీజేపీ రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆర్థిక సహాయం అందించారు. గతంలో అబ్రహం కుటుంబాన్ని పరామర్శించిన సైదిరెడ్డి, వారి దీనస్థితిని తెలుసుకుని అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా తన తరఫున బీజేపీ పట్టణ నాయకుల ద్వారా కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్, జిల్లా నాయకుడు బెల్లంకొండ నరేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి రాళ్లబండి రామారావు, దళిత మోర్చా నాయకుడు మేళ్లచెరువు...