అనుమతులు లేని లక్కీ డ్రాలు నిర్వహిస్తే కఠిన చర్యలు

ప్రజల కష్టార్జితాన్ని దోచుకుంటే కేసులు నమోదు చేస్తాం: ఎస్పీ కె. నరసింహా సూర్యాపేట, నవంబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల): ప్రభుత్వ అనుమతులు లేకుండా లక్కీ డ్రాలు, అదృష్ట పథకాల పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం చట్టవిరుద్ధమని జిల్లా ఎస్పీ కె. నరసింహా, ఐపీఎస్ హెచ్చరించారు. తక్కువ మొత్తంలో డబ్బులు చెల్లిస్తే కార్లు, ద్విచక్ర వాహనాలు, బంగారు ఆభరణాలు వంటి విలువైన బహుమతులు వస్తాయని ఆశ చూపి ప్రజలను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ పథకాల ద్వారా ప్రజల కష్టార్జితాన్ని దోచుకోవడం సామాజిక, ఆర్థిక నేరమని పేర్కొన్నారు. అనుమతులు లేకుండా లక్కీ డ్రాలు, ప్రైజ్ చిట్స్...