ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు: పోస్టింగులు ఖరారు చేస్తూ ఐజీ ఉత్తర్వులు!
హనుమకొండ, నవంబర్ 04 (ప్రజానేస్తం జ్వాల- ప్రతినిధి : మారెల్లి కిరణ్): ప్రొబేషనరీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఇద్దరు అధికారులకు పూర్తిస్థాయి సబ్ రిజిస్ట్రార్లుగా పోస్టింగులు ఖరారు చేస్తూ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హన్మంతు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. శ్రీరాం మధును వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో (ఆర్వో) జాయింట్-2 సబ్ రిజిస్ట్రార్‌గా, మేకల ఉపేందర్‌ను వరంగల్ ఫోర్ట్ సబ్ రిజిస్ట్రార్‌గా నియమిస్తూ బాధ్యతలు కేటాయించారు. కాగా, రాబోయే దీపావళి సాధారణ బదిలీల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని మరిన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు రెగ్యులర్ అధికారులు వచ్చే అవకాశముందని శాఖ వర్గాలు తెలిపాయి.