హనుమకొండ జేఎన్ స్టేడియంలో రేపటి నుంచి జిల్లా స్థాయి యువజనోత్సవాలు!
హనుమకొండ, నవంబర్ 04 (ప్రజానేస్తం జ్వాల- ప్రతినిధి : మారెల్లి కిరణ్): యువతీ యువకుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యాలను వెలికితీసే లక్ష్యంతో ఈ నెల 5వ తేదీన హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ (జేఎన్) స్టేడియంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి కొత్త ప్రశాంత్ వెల్లడించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు 15 నుంచి 29 సంవత్సరాల లోపు వయస్సు గల యువతీ యువకులు అర్హులని స్పష్టం చేశారు. పోటీల్లో భాగంగా జానపద నృత్యం, జానపద గీతాలు, చిత్రలేఖనం, వీధి నాటకం, కవిత్వం విభాగాల్లో పోటీలు జరుగుతాయని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా అధికారిక 'మై...