ఆపదలో ఉన్న వార్డు వాసికి అండగా కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి

సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరుకు కృషి చేస్తానని హామీ హుజూర్‌నగర్, నవంబర్ 3 (ప్రజానేస్తం జ్వాల): ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవడమే ప్రజాప్రతినిధుల బాధ్యతని చాటుతూ హుజూర్‌నగర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, 25వ వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి మానవీయతను చాటుకున్నారు. సీతారాం నగర్‌లోని 25వ వార్డుకు చెందిన పోలా నరసింహారావు ఇటీవల ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. కాలికి శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న కౌన్సిలర్ సంపత్ రెడ్డి మంగళవారం స్వయంగా వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. బాధితుడికి ధైర్యం చెబుతూ, కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా బాధిత...