తుఫాన్‌ ముప్పు.. సూర్యాపేట జిల్లాకు హై అలర్ట్!

📌 ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రయాణాలు నిలిపివేయాలని కలెక్టర్ సూచన గంటకు 80 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం.. అధికారులతో కలెక్టర్ అత్యవసర సమీక్ష సూర్యాపేట, నవంబర్ 2 (ప్రజానేస్తం జ్వాల): బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుఫాన్‌ ప్రభావం సూర్యాపేట జిల్లాపై పడే అవకాశం ఉందని, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలతో పాటు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసిన...