మురాసు తుఫాన్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి

గరిడేపల్లి మండల ప్రజలకు తహసీల్దార్‌ సూచనలు.. నేడు సాయంత్రం 4 గంటలలోపు ఇళ్లకు చేరుకోవాలి గరిడేపల్లి, ప్రజానేస్తం జ్వాల న్యూస్: మురాసు తుఫాన్‌ నేపథ్యంలో గరిడేపల్లి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ సూచించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రజలకు పలు జాగ్రత్తలు సూచిస్తూ ప్రకటన విడుదల చేశారు. తుఫాన్‌ తీవ్రత నేడు సాయంత్రం 4 గంటల నుంచి రేపు సాయంత్రం వరకు అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తుఫాన్‌ ప్రభావం దృష్ట్యా ప్రజలు సాధ్యమైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, పాడుబడిన ఇళ్లు, శిథిలావస్థలో ఉన్న గోడలు, విద్యుత్‌ స్తంభాల సమీపానికి వెళ్లవద్దని సూచించారు. బలమైన గాలుల...