అన్నం మెతుకుపై అక్రమ వ్యాపారుల కన్ను!
📌 పేదోడి బువ్వపై పెద్దల దందా..! సన్నబియ్యం ధర సెంచరీ దాటిందా? ఎల్నినో పేరుతో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు ధాన్యం నిల్వలున్నా బియ్యం ధరల మంట.. అధికారుల పర్యవేక్షణ ఏదీ? ప్రజానేస్తం జ్వాల న్యూస్ | ప్రత్యేక కథనం అన్నం మెతుకుపై అక్రమ వ్యాపారుల కన్ను పడిందా? సామాన్యుడి కంచంలోని బువ్వ వ్యాపారుల లాభాల వేటకు అడ్డాగా మారిందా? సన్నబియ్యం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కిలో సన్నబియ్యం ధర రూ.100 దాటుతోందన్న ప్రచారం వినిపిస్తుండగా, ధరల పెరుగుదలకు అసలు కారణాలేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు వరి సాగు కోసం రైతులు చెమటోడ్చుతుంటే, మరోవైపు వినియోగదారులు బియ్యం...