పర్యావరణ పరిరక్షణలో నేరేడుచర్ల పీఎం శ్రీ పాఠశాలకు జిల్లా ప్రథమ బహుమతి

నేరేడుచర్ల, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల): పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల అమలులో ప్రతిభ కనబరిచిన నేరేడుచర్ల పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు జిల్లా స్థాయి ప్రథమ బహుమతి లభించింది. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ (సీజీఆర్), తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో పాఠశాలకు రూ.20 వేల నగదు బహుమతి, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేశారు. పాఠశాల తరఫున ఫిజికల్ డైరెక్టర్, యంగ్ ఎర్త్ లీడర్స్ మెంటర్ ఎం. యాదగిరి అవార్డును స్వీకరించారు. పాఠశాలలో పచ్చదనం, మొక్కల పెంపకం, పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపుపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయుడు బట్టు మధు తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల...