ట్రైసిటీలో ‘కమ్యూనిటీ కనెక్ట్’ కార్యక్రమం ప్రారంభం

హనుమకొండ, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల): నేరాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘కమ్యూనిటీ కనెక్ట్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసులు ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి సైబర్ మోసాలు, మహిళలు, చిన్నారుల భద్రత, ఇళ్ల దొంగతనాల నివారణ, గంజాయి, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సోషల్ మీడియా ఖాతాల భద్రతపై అవగాహన కల్పించనున్నారు. కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను కూడా వివరిస్తారు. పైలట్ ప్రాజెక్టుగా తొలుత నగర పరిధిలోని తొమ్మిది కీలక పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు సీపీ వెల్లడించారు.