ఎంజీఎంలో మహిళ మృతి.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు

వరంగల్, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల): వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 55 ఏళ్ల నండ్రే రమాదేవి మృతి చెందారు. సకాలంలో సరైన వైద్యం అందకపోవడంతోనే ఆమె మరణించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వరంగల్‌ ఏనుమాముల పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన రమాదేవి అనారోగ్యంతో ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. అత్యవసర సమయంలో వైద్యులు సకాలంలో స్పందించలేదని ఆరోపిస్తూ ఆమె భర్త మట్టెవాడ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మృతికి గల కారణాలు, అందించిన వైద్య సేవలపై సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యం నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.