భీమారానికి హనుమకొండ మహిళా పోలీస్ స్టేషన్ తరలిం పు

హనుమకొండ, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పైఅంతస్తులో కొనసాగుతున్న మహిళా పోలీస్ స్టేషన్‌ను భీమారంలోని నూతన భవనానికి తరలించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సమీపంలోని పోలీస్ క్వార్టర్స్ ప్రాంగణంలో ఈ నూతన భవనాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మహిళలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంతో పాటు, కుటుంబ సమస్యలపై ప్రశాంత వాతావరణంలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఈ మార్పు చేసినట్లు వివరించారు. నవంబర్ 1 నుంచి మహిళా పోలీస్ స్టేషన్ సేవలు భీమారంలోని నూతన భవనం నుంచే అందుబాటులో ఉంటాయని సీపీ వెల్లడించారు.