38వ రోజుకు చేరిన తీన్మార్ మల్లన్న బీసీ రాజ్యాధికార యాత్ర

హనుమకొండ, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర 38వ రోజుకు చేరుకుంది. నల్లగొండ జిల్లా త్రిపురారం నుంచి మిర్యాలగూడ వైపు పాదయాత్ర కొనసాగుతోంది. యాత్రకు మద్దతుగా టీఆర్‌పీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పూజరి సత్యనారాయణ ఆధ్వర్యంలో హనుమకొండ, వరంగల్, గ్రేటర్ వరంగల్ ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు గత ఐదు రోజులుగా పాదయాత్రలో పాల్గొంటున్నారు. బీసీల హక్కుల సాధన లక్ష్యంగా సాగుతున్న యాత్రకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పెండెల సంపత్, వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట రాజు, జంగిలి శ్రీనివాస్, గట్టు నవీన్, ఫర్హాత్ నహిదా,...