రాష్ట్రస్థాయి సాంస్కృతిక పోటీల్లో శాయంపేట ఉపాధ్యాయుల ప్రతిభ

శాయంపేట, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో అక్టోబర్ 28 నుంచి 30 వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి నాటిక, సంగీత, నృత్య పోటీల్లో శాయంపేట మండలానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు ప్రతిభ కనబరిచారు. పత్తిపాక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు వారణాసి అంజనీ ‘చేతిలో ప్రపంచం’ లఘునాటికతో పాటు లలిత సంగీతం, బంజారా నృత్య ప్రదర్శనలో పాల్గొని నిర్వాహకుల నుంచి సన్మానం పొందారు. పెద్దకోడెపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు సారంగపాణి జానపద గీతాన్ని ఆలపించి కల్చరల్ సెక్రటరీ యామిని కనకతార చేతుల మీదుగా ప్రశంసాపత్రం...