నేరేడుచర్లలో ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవం

నేరేడుచర్ల, అక్టోబర్‌ 31 (ప్రజానేస్తం జ్వాల): సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపల్ కేంద్రంలో ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ ఏఐటీయూసీ సహాయ కార్యదర్శి ముత్యాల భాస్కర్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు, జిల్లా గౌరవాధ్యక్షుడు చిలకరాజు శ్రీను, జిల్లా సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్, సీపీఐ సీనియర్ నాయకుడు బెల్లంకొండ గోవింద్ గౌడ్, ఇన్సాఫ్ నాయకుడు ఎస్కే సైదా కాసిం హాజరయ్యారు. అలాగే ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడు పరికె భరత్, పట్టణ అధ్యక్షుడు వాడాల భాస్కర్, ఏఐటీయూసీ నాయకులు బండి శ్రీనివాస్, గోరుగంతం శ్రీనివాస్,...