బీజేపీ వరంగల్ జిల్లా రజక కో-కన్వీనర్‌గా కాండ్రాతి శీను నియామకం
వరంగల్, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల): వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 38వ డివిజన్‌కు చెందిన కాండ్రాతి శీనును భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా రజక కో-కన్వీనర్‌గా నియమించారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌తో పాటు పార్టీ నాయకులకు కాండ్రాతి శీను కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.