మిర్యాలగూడలో లీగల్ మెట్రాలజీ అధికారుల తనిఖీలు.. 8 కేసులు నమోదు

మిర్యాలగూడ, అక్టోబర్‌ 31 (ప్రజానేస్తం జ్వాల): నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో లీగల్ మెట్రాలజీ అధికారులు రైస్ మిల్లులు, బియ్యం విక్రయ దుకాణాల్లో మెరుపు తనిఖీలు నిర్వహించారు. ఐదు రైస్ మిల్లులు, మూడు బియ్యం దుకాణాలను తనిఖీ చేసి నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 8 కేసులు నమోదు చేశారు. బియ్యం బస్తాలపై ప్రకటించిన నికర బరువును వినియోగదారులు పరిశీలించాలని, బస్తా బరువును మినహాయించి బియ్యం అసలు బరువును తూకం వేయించుకోవాలని అధికారులు సూచించారు. వ్యాపారులు తూనికలు, కొలతల చట్ట నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.