ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకుల నివాళులు
నేరేడుచర్ల, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల): మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ 42వ వర్ధంతి సందర్భంగా నేరేడుచర్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఆమె చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొణతం చిన్న వెంకటరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల సందీప్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టా రామారావు, మాజీ మున్సిపల్ చైర్మన్ బచ్చలకూరి ప్రకాష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వల్లం చెట్ల రమేష్ బాబు, మాజీ సర్పంచ్ ఆకారం వెంకటేశ్వర్లు, మాజీ పీఏసీఎస్ చైర్మన్ అనంత శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు...