నల్లగొండ కిసాన్ సభ మహాసభలను జయప్రదం చేయాలి
సూర్యాపేట, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల): నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో నిర్వహించనున్న అఖిలభారత కిసాన్ సభ 36వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేటలో జరిగిన తెలంగాణ రైతు సంఘం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ 15న ఎన్జీ కళాశాల మైదానంలో రైతులతో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ 14న జరిగే రైతు ఎగ్జిబిషన్లో వ్యవసాయ రంగ చరిత్ర, రైతాంగ ఉద్యమాలు, ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులకు సంబంధించిన అంశాలను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. మహాసభలకు దేశవ్యాప్తంగా 850 మందికి పైగా ప్రతినిధులు, పరిశీలకులు హాజరవుతారని...