NHM ఉద్యోగుల సమ్మెకు తుడుం దెబ్బ మద్దతు
ఆసిఫాబాద్, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట NHM ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు తుడుం దెబ్బ జాతీయ అధ్యక్షుడు కోట్నాక విజయ్ కుమార్ సంఘీభావం ప్రకటించారు. సమ్మె 18వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఆయన ఉద్యోగులను కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కోట్నాక విజయ్ కుమార్ మాట్లాడుతూ NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం చేపట్టిన పోరాటానికి తమ...