మానవత్వం చాటుకున్న సర్పంచ్.. మృతురాలి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం
ధర్మసాగర్, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల): ధర్మసాగర్ మండలంలోని కేశవనగర్ గ్రామానికి చెందిన గంగారపు ఎల్లమ్మ (భర్త సాయిలు) మరణించిన విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ గంగారావు జయ రాజేందర్ వెంటనే స్పందించారు. మృతురాలి కుటుంబ ఆర్థిక పరిస్థితిని గుర్తించి, వారి కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోరంట్ల సాధన్ రాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు బొజ్జ రమేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొని మృతురాలి...