జాఫర్‌గఢ్ గురుకులంలో రూ.42 లక్షల ఆర్థిక అక్రమాల ఆరోపణలు.. ప్రిన్సిపాల్ సంతకం ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదు!

జనగామ, అక్టోబర్‌ 30 (ప్రజానేస్తం జ్వాల): జనగామ జిల్లాలోని జాఫర్‌గఢ్ గురుకులంలో సుమారు రూ.42 లక్షల ఆర్థిక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గురుకుల మహిళా ప్రిన్సిపాల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు జూనియర్ అసిస్టెంట్‌పై ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. గురుకులానికి సరుకులు, సేవలు అందించిన వెండర్లకు చెల్లించాల్సిన 35 చెక్కులను వారి పేర్లకు బదులుగా తన స్నేహితుల పేర్లపైకి మార్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చెక్కుల ద్వారా సుమారు రూ.42 లక్షల మేర నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని గుర్తించిన మహిళా ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు...