2075 నాటికి మనిషి ఆయుర్దాయం 120 ఏళ్లకు చేరే అవకాశం
హనుమకొండ, అక్టోబర్ 30 (ప్రజానేస్తం జ్వాల): శాస్త్ర, సాంకేతిక, బయోటెక్నాలజీ రంగాల్లో ప్రస్తుత పురోగతి కొనసాగితే 2075 నాటికి మానవుల ఆయుర్దాయం 120 ఏళ్లకు చేరే అవకాశం ఉందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మాజీ కార్యదర్శి డా. శ్రీవారి చంద్రశేఖర్ అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన తొలి ఎండోమెంట్ లెక్చర్లో ఆయన ముఖ్య వక్తగా ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణకు వివిధ శాస్త్రరంగాల సమన్వయం, అంతరశాఖ పరిశోధనలు అవసరమని పేర్కొన్నారు. సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం, వ్యర్థాల పునర్వినియోగంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేయూ వీసీ ఆచార్య కె. ప్రతాప్ రెడ్డి, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.