మాతృభాష అధ్యయనంతోనే విద్యార్థుల సమగ్ర వికాసం: కేయూ వీసీ
హనుమకొండ, అక్టోబర్ 30 (ప్రజానేస్తం జ్వాల): విద్యార్థుల్లో మేధో వికాసం, ఆలోచనా శక్తి పెంపునకు మాతృభాషా అధ్యయనం ఎంతో కీలకమని కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి అన్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కేయూ పరిధిలోని డిగ్రీ తెలుగు మొదటి, మూడో సెమిస్టర్ నూతన పాఠ్యపుస్తకాలను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భాషా సాహిత్యాల అధ్యయనం విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, సృజనాత్మక ఆలోచనలను పెంపొందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ సురేష్ లాల్, వివిధ విభాగాల అధ్యాపకులు, భాషా పండితులు పాల్గొన్నారు.