భూముల రీ సర్వే పకడ్బందీగా చేపట్టాలి

అసిఫాబాద్, అక్టోబర్‌ 30 (ప్రజానేస్తం జ్వాల): కెడస్ట్రల్ మ్యాపులు లేని గ్రామాల్లో భూముల రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. రైతులందరూ 100 శాతం సర్వేలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో రెండో విడతలో భాగంగా ప్రతి మండలంలో రెండు గ్రామాల చొప్పున రీ సర్వే చేపడుతున్నట్లు కలెక్టర్ హరిత తెలిపారు. సర్వేకు సంబంధించి రైతులకు టాంటాం ద్వారా, ఫోన్ కాల్స్‌తో ముందస్తు సమాచారం అందిస్తున్నట్లు వెల్లడించారు.