రైతు ధాన్యం తరలింపుపైనా కేసులా?
•పంట పండించడానికి ప్రకృతితో పోరాటం.. అమ్ముకోవడానికి దళారులతో పోరు.. ఇప్పుడు రవాణాపైనా అధికారుల ఆంక్షలా! •రైతులపై RTO కేసులు నమోదు చేయొద్దు.. మానవతా దృక్పథంతో వ్యవహరించాలి: రాపోలు నవీన్ కుమార్ నేరేడుచర్ల, ప్రజానేస్తం/జ్వాల:రైతన్నకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయని, పంట పండించడానికి ప్రకృతితో పోరాడిన రైతు.. పంట అమ్ముకోవడానికి దళారులతో పోరాడుతుంటే, చివరకు ధాన్యం రవాణా చేసుకునేందుకు అధికారుల కేసులను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు రాపోలు నవీన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నేరేడుచర్ల కేంద్రంలో రైతులతో కలిసి ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలు, తుఫానుల ప్రభావం, విద్యుత్ కోతలు, సాగునీటి కొరత వంటి అనేక సమస్యలను అధిగమించి...