వెలిదండలో అంగన్వాడీ భవన స్లాబ్ పనులు ప్రారంభం

వెలిదండ, అక్టోబర్ 30 (ప్రజానేస్తం జ్వాల): గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో నిర్మిస్తున్న నూతన అంగన్వాడీ భవన స్లాబ్ పనులను గురువారం గ్రామ సర్పంచ్ చెన్నగాని సాంబయ్య కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మంత్రి సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు జంగం కోటేశ్వరరావు, వార్డు సభ్యులు కామళ్ళ వెంకటి, దుగ్గి చైతన్య, తిరుపయ్య, నాయకులు కామళ్ళ ధైర్యప్ప, తుల్లూరి లూకాస్, నాగరాజు, చింతమల్ల బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.