రూ.22 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామ పాలనా అధికారి

మంచిర్యాల జిల్లాలో ఘటన.. రెవెన్యూ రికార్డుల్లో తండ్రి పేరు సవరణకు లంచం డిమాండ్ మంచిర్యాల: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు మరో అధికారి పట్టుబడ్డాడు. మంచిర్యాల జిల్లా మోసం గ్రామానికి చెందిన గ్రామ పాలనా అధికారి (GPO) డి. శ్రీనివాస్ రూ.22,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. రెవెన్యూ రికార్డుల్లో తండ్రి పేరును సరిదిద్దేందుకు పై అధికారులకు నివేదిక పంపాల్సి ఉండగా, ఇందుకోసం శ్రీనివాస్ లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టిన ఏసీబీ అధికారులు, లంచం తీసుకుంటున్న సమయంలో ఆయనను పట్టుకున్నట్లు సమాచారం. నిందితుడిని అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిసింది....