హుజూర్‌నగర్‌లో ‘చల్తా హై’ ట్రాఫిక్‌నా..?
పొట్టి శ్రీరాములు సెంటర్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణలు.. రోడ్డుపైనే వ్యాపారాలు! రెండు ప్రమాదాలు జరిగినా మారని పరిస్థితి.. ట్రాఫిక్ నియంత్రణపై అధికారుల నిర్లక్ష్యమా? హుజూర్‌నగర్, అక్టోబర్ 29 (ప్రజానేస్తం జ్వాల): అంతా మా ఇష్టం.. మమ్మల్ని అడిగేదెవరు? అన్నట్లుగా హుజూర్‌నగర్ పట్టణంలోని పొట్టి శ్రీరాములు సెంటర్‌లో ట్రాఫిక్ పరిస్థితి తయారైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిత్యం వాహనాలు, ప్రయాణికులతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు, రోడ్డుపై వ్యాపారాల నిర్వహణతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనం రద్దీ.. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు పొట్టి శ్రీరాములు సెంటర్ పరిసరాల్లో బస్టాండ్, ఆటో స్టాండ్, ద్విచక్ర వాహనాల రాకపోకలతో పాటు పోస్టాఫీసు, గ్రంథాలయం ఉండటంతో...